చిరునవ్వుల దీపాలు
చిరునవ్వుల దీపాలు
చిరునవ్వుల దీపాలు మోములోన వెలగనివ్వు
కలతనింపు చీకట్లను మనసులోన తొలగనివ్వు
నిరాశతో గెలుపు పోరు మధ్యలోనె విరమించకు
చిరుఆశల బీజాలనూ యెదలోన మొలవనివ్వు
ఇరవైలో అరవైలా ఆలోచనలు తగవులే
భవితను హరితవనముగా.. బతుకులోన పెరగనివ్వు
కృషి ఉంటే మనుష్యులే మహనీయు లవుతారు
ప్రయత్నమే సాధనగా
ధరణిలోన చేయనివ్వు
శిఖరాగ్రం చేరుకొనే పట్టుదలే ఉండవలెను
లక్ష్యమే అస్త్రము .. గెలుపు దారిలోన సాగనివ్వు

