STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

నేనెవరో చెప్పాలా...

నేనెవరో చెప్పాలా...

1 min
4


నీ తలపు వెనుకవలపును నేనై పలకరించిపోతున్నా.

మదితంత్రులను మీటి పోతున్నా.

నా ఊహకి రెక్కలొచ్చి ప్రణయసందేశాన్ని మోసుకుంటూ

శ్వేత కపోతమైనీ భుజంపై వాలుతున్నా.

నా కెంపు పెదవిపై విరిసిన దరహాసమై నీమదిని కోసే చంద్రహాసమై సప్తవర్ణాలను నింపుకున్న ధవళ కిరణమై

సమీరంలోని నిశ్శబ్ద ప్రేమలేఖనై రాగాలపల్లకిలో నిను పలకరించే మౌనగానమై మదిని తాకుతున్నా.

నీకై వ్రాసే కవనాన్నై అక్షర నివేదన చేసే గీతాన్నై

నీ చక్షువులను తాకుతున్నా నీ శ్రవణాలలోనికి చేరుకుంటున్నా

ఇంకా అడుగుతున్నావా నేనెవరని?

ఇంకా ప్రశ్నిస్తున్నావా నీదైన నా అస్తిత్వాన్ని...!!!

 


Rate this content
Log in

Similar telugu poem from Romance