తడిసిన గులాబి
తడిసిన గులాబి
తడుస్తున్న ఒకగులాబి..పరవశమే చూసినాను..!
మౌననదిగ ప్రవహిస్తూ..చెలిమిమీర పొంగినాను..!
కబురులాడు చినుకులతో..ముద్దులాట కేమున్నది..
వరదలైన వానలోన..పుడమిరొదను కాంచినాను..!
పునర్వసును ముంచెత్తిన..తుఫానురుద్రు నేమనను..
రుధిరమైన వాననీటి..ఉప్పెనపై అలిగినాను..!
నేలతల్లి అసహాయగ..మిగిలి కరిగిపోయేనా..
కళతప్పిన రైతన్నకు..ఊపిరంద మొక్కినాను..!
పరిశోధనలెన్నొ చేసి..కాలుష్యము పెంచితినే..
చేతులు కాలిన తదుపరి..ఆకులకై వెదికినాను..!
జీవకోటి పరిరక్షణ..ధర్మము మరచి వగచుటా..
మాంసాహారమును మరిగి..ఎంత హాని చేసినాను..!

