కాల చక్రం
కాల చక్రం
భావము అక్షర..తీర్థము అందును..!
చూపులు నిల్పిన..జ్ఞానము అందును..!
తీరని వేదన..సొంతము కావలె..
సాధన తోడుగ..భాగ్యము అందును..!
కాలము చిత్రము..జన్మల చక్రము..
నవ్వుల కోవెల..అద్దము అందును..!
మానస వీధుల..నాటకమే ఇది..
రంగుల పండుగ..రాజ్యము అందును..!
చిక్కని చక్కని..హంసల దీవిరొ..
వీడని చక్కని..మౌనము అందును..!

