భరించలేని బ్రతుకు
భరించలేని బ్రతుకు
భయమన్నది బ్రతుకైతే
నిత్యం చస్తూ బ్రతకాలి,
క్రూరమృగాల లోకంలో తెలివితో మసలడం నేర్వాలి,
అసంతృప్తి భావాలు హృదినివీడి పోవాలి,
అగాధపు అంచున పయనించిన అది రేపటి వాస్తవాన్ని చూడాలి,
నీకన్నా బలవంతుడైతే
అహంకారంపై చావుదెబ్బ కొట్టాలి.
మృగరాజైనా దున్నకొమ్ముబలం చూసి దడవాలి,
చేతగాని తనమే
అణగారిన ఆశల పుట్టిల్లని గ్రహించాలి,
కలలోన కదలాడే ఆనందం మనుగడలో సాధించాలి,
అలజడులను
ఓడిపోని ఓర్మితో సాగనంపాలి.
దైవమన్నదే నీడలాగ తోడై ఉండుననే ఆలోచన వీడాలి,
చింతలు వదిలించే ఆత్మశక్తి
నీ క్రియాశక్తి అవ్వాలి,
జీవితమే ఒక పోరాటమైతే పరిగెత్తే కాలానికి ధీటుగా తెలివిగా బ్రతకనేర్వాలి
