సింధూరం - చింతపల్లి శివసంతోష్
సింధూరం - చింతపల్లి శివసంతోష్

1 min

363
పచ్చని కారు అడివిలో,
ఒక ఎర్రదండు వలస ఒకటి పోతుంది,
కన్నీటిని ఓదార్చుకుంటు,
చేవ చచ్చిన చేతులతో,
అలసిన కాళ్ళను ఇడ్చుకుంటు,
బాధతో బరువెక్కిన గుండెతో,
నిశబ్దంగా వచ్చిన ఎన్ కౌంటర్ కారు మబ్బు,
తమ నాయకుడిని మింగేసింది అనే నిజాన్ని మరుపురానియక,
ఆ వలస పోతుంది....
చరిత్రకు విన్పించని నిజాలు,
సామాన్య కంటికి కన్పించని వాస్తవాలు,
పేలిన తూటాలకు,
చావును చూసిన కంటికే తెలిసాయి.
అందుకే అవన్నీ అజ్ఞాతంలోనే మిగిలిపొతూన్నాయి.