STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కోమలి

కోమలి

1 min
7


కోవెల ముంగిట వెలసిన కోమలి
నను మెచ్చగా విడిగెను తనువే
ఆలయ మందున తిరుగెడు ఆమని
నను చేరగా వలచెను మనసే

సువర్ణ శోభిత మాధురి రమణీ
విషిష్ట రీతుల దోచెను మదినే
నవ్వుల పువ్వులు రువ్వెను సుమతీ
ఝమ్మని తాకగ డెందము ద్రవించె 

తొలిచూపే శరమయ్యే మంచువంటి మనసుమీద
తనుతక్కా జగతిలోన తోడునీడ గతిలేదని
చిరునవ్వుల శాసించీ వరమిచ్చే చిగురుబోడి
ననుగావగ నడిచొచ్చిన నందనవన మయూరమూ

కష్టకాల మందునుండు నాజతలో మహాలక్ష్మి
సుఖసమయము నందుజుట్టు నాతనువూ లతాంగియై
ఇష్టకాల మందునుండు నామదిలో మహారష్మి
ఎల్లకాలమింటిలోన అలుపెరుగని అమ్మవారు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics