మంచిదనం
మంచిదనం
పద్యం:
పచ్చదనము వుండు పచ్చని చెట్టందు
తేటదనము వుండు తెలుగునందు
మనిషిలోన మాయమాయె మంచితనము
పలుకులమ్మ దివ్య భారతాంబ
భావం:
చదువుల తల్లి సరస్వతీ! పచ్చదనం చెట్టు లో, తేట దనం తెలుగు లో ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ మనిషి లో ఉన్న మంచితనం మాత్రం మాయం అవుతుంది