STORYMIRROR

Meenakshi Dantu

Classics

4  

Meenakshi Dantu

Classics

స్టీఫెన్ హాకింగ్

స్టీఫెన్ హాకింగ్

1 min
475

స్టీఫెన్ హాకింగ్ 

దృఢ సంకల్పముతో 

తన మరణాన్ని వెనక్కినెట్టాడు .

ఒంట్లో నాడులు దెబ్బతిన్నా 

విశ్వాంతరాళంలో ఉన్న

చిక్కుముడులను 

చాకచక్యంతో పురివిప్పాడు .

మనిషిమేధస్సుకు అందనివిషయాలు 

వేలలో ఉన్నాయని 

అంతః సూత్రంగా తెలియచెప్పాడు .

కలుషిత గాలికి, నీటికీ 

మనిషిదూరమవ్వాలని 

అంతర్వాణి వినిపించాడు.

తన స్వశక్తితో 

మానసిక వైకల్యాన్ని జయించాడు.

అంగవైకల్యంకన్నా 

దాన్ని గేలిచేసే భావమే 

ఎక్కువ బాధాకరమన్నాడు.

భూమి ఉష్ణోగ్రతలుకన్నా 

ఇప్పుడు కొందరు మనుషుల్లో పెరిగిపోతున్న 

ఉష్ణోగ్రతలే మిక్కిలి ప్రమాదమని 

ఎలుగెత్తి చాటాడు 

శుక్రగ్రహానికి శుక్లమ్ పట్టిందన్నాడు.

మనిషి నివాసాల గురించి 

మనిషే పట్టించుకోవాలని 

ఏదో యుక్తి , మరేదో అతీతశక్తి కాపాడదన్నాడు.

తన వైజ్ఞానిక విజ్ఞానంతో 

ఖగోళాన్ని కుదిపేశాడు.

విపరీత సాంకేతికతoటే ? 

మనుషులు కరిమింగిన

వెలగపండ్లు అవుతారన్నాడు.

అంతరిక్షంలో వందల కృష్ణబిలాలలను కనుగొన్న 

వెలుగుకిరణం స్టీఫెన్ హాకింగ్



Rate this content
Log in

Similar telugu poem from Classics