STORYMIRROR

వెంకు సనాతని

Classics

4  

వెంకు సనాతని

Classics

నీ వాలెంటైన్..

నీ వాలెంటైన్..

1 min
754

నా ఈ ప్రాణం నీ కోసమే 

నా ఈ హృదయం నీ కొరకే 

నా ఈ జీవితం నీకే 

నిన్ను చూడగానే 

నా మదిలో మెదిలిన భావాలు ఇవే 

నీకూ నాలాగే కలిగెనా అన్నట్టు 

నీ చూపులు నా మనసును మెలివేశాయి 

నేను నేరం చేసే కారాగారంలో ఉన్నా

ప్రతి హృదయాన్ని ప్రేమగా పలకరించినందుకు 

ప్రేమను నీకు కానుక చేసినందుకు 

నిన్ను తలచుకుంటూ నేను లోపల 

నాకై ఎదురు చూస్తూ నీవు వెలుపల 

పర్వాలేదు చూపులున్నాయిగా మాట్లాడుకోవడానికి, 

నిన్ను వదలి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది శ్వాసల నిండా ప్రేమని నింపుకుని 

ఆ ఊసే పెద్ద నేరమని ఘోరమైన వేదనకు గురైన జీవితం 

నీకోసం రాలేదు కాదు రాదు అని చెప్పి నిన్ను నొప్పించడం బాధే, 

కానీ నా హృదయంలో పదిలమైన ప్రేమను నీకొదిలి వెళుతున్నా 

నేను లేకపోయినా, నా ప్రేమ లేదనడంలో నిజం లేదు!! 

నీ వాలెంటైన్..


రచన : వెంకు సనాతని


Rate this content
Log in

Similar telugu poem from Classics