పూతొట
పూతొట
పూవులమ్మ పూవులు రక రకాల పూవులు విరబూసిన నువ్వులు రంగు రంగుల పూవులు. . పాల నురుగ తెల్లన ,పాడి పంటలు పచ్చన,మంచి మనసు తెల్లన, మల్లె పూలు సువాసన పూవులమ్మ పూవులు విరబూసిన నవ్వులు. తోటలోని వెలుగులు బంతులు చేమంతులు మన కంటికి మెరుగులు జాజులు విరజాజులు. ముని వేళ్ళతో ముట్టుకుంటే పరిమళించే పూవులు సుతి మెత్తగా తాకితే పరవశించే సుమబాలలు గుండెలో దాచుకుంటే కొటు మీద మొగ్గలు చాచా నెహ్రూ పుట్టినరోజు జరుపుకునే అందమయిన బాలులు మందారం పూవులు. కొత్త పెళ్లి కూతురు జడనిండా మల్లెలు మెడనిండా మన నేతలకి విధమయిన పూవులు ఏది ఏమైనా మన సైనిక బలగాల పాదాలకే అభినందనలు వెదజల్లే పూవులు విరబూసిన నువ్వులు
