వెలుగు జిలుగులు
వెలుగు జిలుగులు
దీపాల పండుగ దీపావళి వచ్చింది, ఎన్నో మరెన్నో ఆశలు తెచ్చింది మనసు నిండా మమత పెంచుతూ , ప్రేమ అందరికీ పంచుతూ దీపాల పండుగ దీపావళి వచ్చింది వెలుగు జిలుగులు తెచ్చింది. దీపాల కాంతి నాలుగు దిక్కులా వ్యాపించి అంధకారం నశించి ఆత్మీయత అభిమానం కురిపిస్తూ వెలుగు జిలుగులు తెచ్చింది. అసూయ ఈర్ష్య పగ కుట్ర అనే రాక్షసులని తరుముదాం ప్రేమ దయ కరుణ శాంతి అనే దేవతలను ఆహ్వానించుదాం. దిపాల పండుగ దీపావళి వచ్చింది వెలుగు జిలుగులు ఎన్నో మరెన్నో తెచ్చింది.దీపాల దేదీప్యమాన కాంతి ప్రతి మనిషి జీవితంలో చేకూరుతాయని ఆశించుదాం అందుకు తగిన విధంగానే శ్రమించి భవిష్యత్తుని బంగారు బాటగా మలుచుకుందాం దీపాల పండుగ వచ్చేసింది వెలుగు జిలుగులు తెచ్చింది. దివ్య తేజొవళి ఆనందారావళి ఆమనీ ఈమనీ వెలుగులు విరజిమ్మే దీపావళి ప్రతి ఏటా ఇంకా వెలుగు చిందించి మానవాళికి ఒక శుభం కలుగు చేయు దీపావళి ఇదే మా ఆహ్వానం ఇదే మా నిరావళి.దిపాల పండుగ దీపావళి వచ్చింది వెలుగు జిలుగులు ఎన్నో మరెన్నో తెచ్చింది.
