STORYMIRROR

Anuradha T

Classics Inspirational

4  

Anuradha T

Classics Inspirational

భారత దేశం #Free India

భారత దేశం #Free India

1 min
239

భారత దేశం మన నివాసం ‌భారత‌ సంస్కృతి సాంప్రదాయం శొభాయమానం మంచికి నివాసం మన దేశం‌ శాంతి ప్రేమ ఆప్యాయత అనురాగం మన సందేశం.     అహింస సత్యం మన మార్గం త్యాగం సహనం మన ఆచారం సూర్య కాంతిలా వెలుగుతున్న దేశం మన భారత దేశం. ‌‌‌‌.    ఎందరో యోగులు మరెందరో మహానుభావులు పుట్టిన దేశం మన భారత దేశం వారి త్యాగ ఫలితమే మన స్వాతంత్రం ధన్యోస్మి భారత దేశం ం   ‌‌     స్వాతంత్రం సాధించాం ఒక ప్రశ్న పదే పదే మన మనసును వేధించుదాం ఇదేనా నిజమయిన స్వాతంత్రం అని ప్రశ్నిదాం ‌     మనకు కావాలి స్వాతంత్రం స్వార్థం నిండిన రాజకీయంనుంచి కన్నీళ్లు నిండిన పేదరీకంనుండి కల్మషం పూరిత నాగరీకత నుండి అంతస్తులు ఆస్తి లెక్కలనుండి కావాలి కావాలి మనకు స్వాతంత్య్రం.  ‌     మనకు కావాలి స్వాతంత్రం మనసుని మరిచిన మనుషులునుంచి మానవత విడిచిన అమానుషలనుండి సంఘవిధ్నృహ శక్తులునుంచి సంస్కారం లేని యువతనుంచి కావాలి కావాలి మనకు స్వాతంత్య్రం .  ‌               రండి రండి అందరూ ఏకమవుదాం మనదేశంని ప్రగతి పథంలో ముందుకు నడుపుదాం విశ్వమంతా మనకు చూపాలి గౌరవం అదే కావాలి మన నేపథ్యం.



Rate this content
Log in

Similar telugu poem from Classics