యుద్ధం వద్దు
యుద్ధం వద్దు
లొకులారా మేలుకోండి యుద్ధం ఆపండి,. యుద్ధం వలన ఒరిగేదేమీ లేదు యుద్ధం వలన కలిగేదేమి లేదు! . . ప్రతి యుద్ధం అలజడి కలిగిస్తుంది ప్రతి యుద్ధం అనర్థం తప్పక చూపిస్తుంది ప్రతి యుద్ధం ఎంతో విద్వేషం కలుగచేస్తుంది! . యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి ఆర్తనాదాలు వినిపిస్తాయి మనిషి జీవితం అస్తవ్యస్తంగా మారిపోతాయి! . ఒకప్పటి సూక్తులు విందాం వాటిని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుందాం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులొయ్ ! బుధ్ధం శరణం గచ్ఛామి అందాం ధర్మం శరణం గచ్ఛామి అందాం బుద్దుని నీతులు పాటిద్దాం శాంతి అంతటా ప్రకాశిద్దాం ,,! యుద్ధం శరణం గచ్ఛామి అనవద్దు జనావళికలో ఆక్రోశం పెంచవద్దు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులొయ్ అన్న నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా నమ్మవొయ్ !
