STORYMIRROR

వెంకు సనాతని

Classics

4  

వెంకు సనాతని

Classics

మాతృత్వం అమ్మ దాతృత్వం

మాతృత్వం అమ్మ దాతృత్వం

1 min
348

మాసాలు మోసి

ప్రేవులు తెంచి

ఉసురు పోసి

ఊపిరి నింపి

జన్మనిచ్చిన జనని

నీవు లేనిదే జన్మ లేదు

జన్మ లేనిదే జగం లేదు


అమ్మంటే కరుణ

అమ్మంటే దైవస్మరణ

అమ్మంటే బ్రహ్మ

బ్రహ్మ పేరులో అమ్మ


బ్రహ్మ కన్నా 

అమ్మకే బాగా తెలుసు 

ప్రాణం పోయడం

బ్రహ్మాండాన్నే 

బొజ్జలో దాచిన అమ్మకి

ఏమివ్వగలదు ఈ జీవితం


అవని మోయక మునుపే

అమ్మ మనల్ని మోస్తుంది

మాతృత్వం అమ్మ దాతృత్వం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics