STORYMIRROR

# Suryakiran #

Classics

4  

# Suryakiran #

Classics

మేఘాలలో ...

మేఘాలలో ...

1 min
396

నీ చూపు ...

నాపై పున్నమిరాత్రి ప్రసరించే చల్లని వెన్నెల .

నావైపే వీచే సాయంకాలపు పిల్లతెమ్మెర .


అది

నాలో అభిమానాన్ని మేల్కొలుపునంటే నమ్ము .

నీవంటే

ప్రేమను నా ఎద ఎల్లవేళలా విరజిమ్ము .


కొన్నిరోజులుగ నీవు కనిపించక , మది విలపించగ ...

చుట్టూ చీకటిమేఘాలు కమ్ముకున్నట్లై ,

ఆ విరహాగ్నికి కన్నీరు లోలోపలే ఆవిరిగా మారి ,

ఆవేదనకి గుబులు సుడిగాలిలా రేగి .

నీకోసం అణువణువు వెతికేలా , ఆశలు చిగురించేలా !


ఏమైపోయావు ప్రియా ? కాదని వెళ్ళావు !

నాకు దూరం కావద్దు .

నీలో నా ప్రాణం దాగి ఉందని ఎన్నడూ మరవద్దు !!



Rate this content
Log in

Similar telugu poem from Classics