STORYMIRROR

వెంకు సనాతని

Classics

4  

వెంకు సనాతని

Classics

కారణం నువ్వే!!

కారణం నువ్వే!!

1 min
438

కన్ను నిన్ను చూసినప్పుడు

మిన్ను తాకినంత ఆనందమేసింది

మన్ను మీద నేనున్నా 

టన్ను బరువు నామీదున్నట్టుంది

నీ అందం అద్భుతం

నా ఆనందం అనంతం

నీ అడుగులకు జతౌదామనుకున్నా 

అడుగు కాదు కదా 

అణువు కూడా కదపలేకపోయా నా పాదం 

జరిగే నిన్ను చూస్తూ జగాన్ని మరిచా 

జతగా నన్ను ఇస్తూ యుగాన్ని పరిచా

నిదురలో కలవరింతలకు 

కునుకు దారి తప్పి కలగా మారి 

అలలా కదులుతున్న నీ రూపం తారాడింది

కంటికి కునుకుంటే ఒట్టు 

ఇదంతా నీ కనికట్టు 

సమయాన్ని తొందరపెట్టి 

నిన్న నిన్ను చూసిన

జాగా వద్ద పాగా వేశా

నిజం చెప్తున్నా..

కారణం నువ్వే!!


రచన : వెంకు సనాతని


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics