తప్పు
తప్పు
తప్పక తప్పులు
చేస్తున్నామంటూ..
తప్పు మాసేందుకుమాట్లాడినా
ఒప్పు చేసేందుకు పోట్లాడినా
తప్పుకుంటూ తిరిగినా
తిప్పుకుంటూ తిరిగినా
తప్పులు తుప్పలు తుప్పలుగా చేసినా
తిప్పలు తెప్పలు తెప్పలుగా చేరినా
తప్పు చేయడం మానని వారికి
తప్పంటే తీపి.!
ఆ తీపి వదలని వారి..
మాటల్లో తప్పు
చేతల్లో తప్పు
మంచిని మయం చేసే తప్పు
చెడుని కాయం చేసే తప్పు
తప్పుని వేలెత్తి చూపితే
అదే పెద్ద తప్పు
ఇదీ..
మనుజుల రీతి
నవ సమాజ నీతి
రచన : వెంకు సనాతని
