STORYMIRROR

Kadambari Srinivasarao

Classics

4  

Kadambari Srinivasarao

Classics

దర్జీ

దర్జీ

1 min
327


కుట్టులోక మాంత్రికుడు


🥼👚👕👖👗👗👖👕👚🥼👗👖

నగ్న శరీరానికి ఆచ్ఛాదన సృష్టించి

నయనానందకరం చేయడానికి

అహర్నిశలు పరితపించే

భూలోక బ్రహ్మ అతడు


పొగుల వస్త్రాన్ని కత్తెర దెబ్బతో

ముక్కల పోగు చేసి

అతుకుల అల్లికతో

అందమైన అమరికను సృష్టించడం

అతనికి వెన్నతో పెట్టిన విద్య


మనో వికారాల లోతులు గ్రహించి

నవ్య రూపాలకు మెరుగులు దిద్దుతూ

సాటిలేని మేటి అనిపించుకునే

వస్త్ర మాయాజలంతో మైమరిపించే

కుట్టులోక మాంత్రికుడు


సందర్భమేదైనా అతని యంత్ర చక్రం

కాల చక్రంతో పాటూ గిరగిరా తిరుగుతూ

అలుపులేని పయనంచేస్తూ

ముచ్చట తీర్చే సృష్టి చక్రం


వస్త్రాలంకరణతో

మానవ ఆకారానికి వన్నె తెచ్చి

సమాజంలో దర్జాగా నిలబెట్టే

నవ్య సృష్టికి చిరునామా దర్జీ

🥼👚👕👖👗👗👖👕👚🥼👗👖



Rate this content
Log in

Similar telugu poem from Classics