ప్రేమతో వర్ణమాల
ప్రేమతో వర్ణమాల
అల్లిబిల్లి ఆలోచనలతో
ఆత్రంగా చూస్తున్న
ఇంతి ఎదురుచూపులు ఫలించెనా!
ఈనాడైననూ..!!
ఉండీ ఉండీ వచ్చి
ఊరించే ఊహల్లో
ఋతువులా ఇలా వచ్చి అలా
ఎలా మాయమయ్యెనే అతని రూపు
ఏమిటీ మనసు చేసే గారడీ
ఐననూ ఆనందపు చిరుజల్లులోని
ఒక చినుకు తట్టి లేపెను
ఓహో సుందరీ,స్వప్నసౌధాన్నే సృష్టించినావే నీ ప్రియసఖుని కోసం..
ఔరా! ఎంత చిత్రమైన మనసులు
అంబరాన్ని తాకేటంతటి సంతోషహేల
ఆః!!అనేలా జేసెనే!!
