మేఘాలకు లంచం ఇచ్చాను.
మేఘాలకు లంచం ఇచ్చాను.


ఆకలి తీర్చే అన్నదాత కళ్ళకి
నిత్యం పచ్చతోరణంలా మెరిసే పంటపొలాలు
వర్షపు చినుకు లేక ఎండిపోతుంటే
కొంచెం ఆ వరుణ దేవుడికి నా విన్నపం తెలిపి
వర్షపు జడిని ఇటు పంపించమని కోరుతూ
ఆ మేఘాలకు నా వేదనను లంచంగా ఇచ్చాను...
ఆ వేదన మేఘాల మనసును కరిగించకపోతుందా అనే ఆశతో...
నా వేదనను మరీ ఎక్కువగా అర్థం చేసుకుని అతిగా వరుణ దేవుడిని వేడుకుంటే
ఆయన మరీ ఎక్కువగా కరిగిపోయి వర్షాలతో
పంటలను , ఊర్లను ముంచేస్తూ ఉంటే
మరీఅంత ఉధృతి వద్దు స్వామి ,కొంచెం శాంతించి
అవసరమైనప్పుడు అవసరమైనంత వరకు మాత్రమే నీ దయ చూపించు స్వామి అని
నా మాటను తనమాటగా మేఘాలతో చెప్పించడానికి నా మనసులోని వ్యధను
వేడుకోలుగా మార్చి మేఘాలకు లంచమిచ్చాను.