మానవ శరీరము విశిష్టత ఇది....
మానవ శరీరము విశిష్టత ఇది....
మానవ శరీరము విశిష్టత ఇది....
మట్టి కట్టే రా..! మట్టి కట్టే రా...!
ఇది వింత కట్టారా..! అద్భుత కట్టే రా..!
మట్టిలోకి వృధాగా పోనీయకు రా...!!
రక్త,మాంసముల కట్టేయ్యే కాదురా ..!
మోక్ష సాధనకై నిర్మించిన కట్టేరా ...!
సమస్త సృష్టి నిర్మాణము ఇందులో దాగి ఉంది రా... !!మట్టి కట్టే రా!!
విచక్షణ,జ్ఞానములను ప్రసాదింపబడిన కట్టే రా...!
ప్రయత్నంచే నీలో- నిన్ను కలపగల గొప్ప కట్టే రా..!
అనంత చైతన్యభండారమే ఇందులో దాగి ఉంది రా..!!మట్టి కట్టే రా!!
వదలకురా.. వృధాగా పోనీయకు రా.. !
ఈ కట్టే యొక్క గొప్ప లాభాన్ని గ్రహించరా..!
ఆనందించరా.... ఆస్వాదించరా....!!మట్టి కట్టే రా!!