STORYMIRROR

Raja Sekhar CH V

Drama

4  

Raja Sekhar CH V

Drama

ఓ సుఖమా !!

ఓ సుఖమా !!

1 min
393


ఓ సుఖమా !

ఎందుకింత కోపగించావు,

ఎక్కడ దాగి ఉండిపోయావు,

అందరికి నిస్సహాయులు చేశావు,

మనుషుల మనఃశాంతి తీసుకు పోయావు !!


నీ విలువ మాకందరికి తెలియపరిచావు,

మళ్ళీ సంసారంలో ఎప్పుడు తిరుగుతావు,

ఇహలోకానికి క్షమించీ ఎప్పుడు తిరిగి వస్తావు,

మాకందరికి సుఖం సంతోషం ఎప్పడు ప్రసాదిస్తావు !!


ఎలాంటి చక్రవ్యూహం పద్మవ్యూహం రచించావు,

ప్రతి ఒక్కరినీ ఒంటరి అభిమన్యుల వలె మార్చేశావు,

ఇంకెంత కాలం ఇలా మా బాధను చూసి సంతోషించి అందిస్తావు ,

ఇకనైనా మా నిత్య జీవన కార్యకలాపాలను ఆరంభించవూ


Rate this content
Log in

Similar telugu poem from Drama