కవితా పూరణం - 17.03.2020
కవితా పూరణం - 17.03.2020
కవితా పూరణం - 17.03.2020
దత్త పాదం : "దివ్వె వెలుంగు చుండును గదిన్ వెనువెంటన నుండె చీకటిన్ "
పూరణం :
కవ్వించే దేహాన అలుముకున్నఅజ్ఞానమనే ఈ చీకటి ని కోఱక
తవ్వించే కొద్దీ మనసున వెలిగే ఆశాజ్యోతి కనిపించే చిరుదీపం
భవ్యంగా అగుపించే నా సజీవన మార్గం లక్ష్యాన్ని చేరుకునే ఆ
దివ్వె వెలుంగు చుండును గదిన్ వెనువెంటనే నుండే చీకటిన్ ||
ప్రతిపదార్థ భావం :
కవ్వించే = కవ్వింపజేసే (ఉత్తేజ పరిచే ) ;
దేహాన = శరీరమనే ఈ గదిలో ;
అలుముకున్న = విస్తరించి ఉన్న / వ్యాపించి ఉన్న ;
అజ్ఞానమనే = జ్ఞానము లేకపోవడము ;
చీకటిని = తిమిరం / నిశీధి ; కోఱక = కోరుకోకుండగా ;
తవ్వించే = తొలిచే కొద్దీ ; మనసున = మనసులో ; వెలిగే = ప్రకాశించే ;
ఆశా జ్యోతి = ఆశ అనేది వెలుగు/ ప్రకాశం ; కనిపించే = అగుపించే ;
చిరు దీపం = ప్రజ్వలించ బడిన చిన్న దీపం (కాంతి );
భావ్యంగా = గొప్పగా ; అగుపించే = కనిపించే / తలపించే ;
సజీవన మార్గం = జీవనము/ జీవితము లో, (తో ) కూడిన పథం ;
లక్ష్యాన్ని = గమ్యాన్ని / గురిని ; చేరుకునే = సమీపించే ; ఆ = ఆ విధమైన ;
దివ్వె = ప్రకాశవంతమైన దీపం / ఆలోచన / తలంపు ;
వెలుగుచుండును = ప్రకాశించు చుండే ; గదిన్ = గదిలో ;
వెనువెంటనే = త్వరితముగా / దాని వెంటనే (IMMEDIATE గా )
నుండె చీకటిని = నిశీధి / అజ్ఞానమనే రేయి ఉండెను.
అని దత్త పాదము యొక్క భావము .
వ్యాఖ్య : అంటే చీకటి - వెలుగులు , కష్ట సుఖాలు ,
మొదలైనవి కాలభ్రమణంలో ఒకదాని వెంట మరియొకటి
వర్తులాకారములో తిరుగుతూ మానవులపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి .
# ########