ఆ మెరుపు
ఆ మెరుపు
1 min
321
కిల కిలా నవ్వుతున్న చిన్నారి లోని మెరుపు!
తనని చూసిన తల్లి కళ్లలో మెరుపు!
మిల మిలా మెరిసి పంటలో మెరుపు!
దాన్ని చూసిన రైతు సంతోషం లోని మెరుపు!
గల గల పొంగే గోదారి లో మెరుపు!
ఆ జలాన్ని త్రాగే వారి త్రుప్తి లో మెరుపు!
అలసి సొలసి పొందిన విజయంలో మెరుపు!
ఆ గెలుపు తెచ్చిన ఉత్సాహం లోని మెరుపు!
నేను రాసే ఈ కవితలో మెరుపు!
దాన్ని రాసె నా లో మెరుపు!
ఈ మెరుపుల్లోని ఉత్తేజం!
కావాలి శాశ్వుతం!