STORYMIRROR

నిన్ను నువ్వు ప్రేమించు

నిన్ను నువ్వు ప్రేమించు

1 min
468


పడిపోతున్నా

అగాథం లోకి

పట్టుకొనేదెవరు


కూరుకుపోతున్నా ఊబిలో

బయటకు లాగేదెవరు


దహించుకుపోతున్నా ద్వేషాగ్నిలో

మంటల్ని ఆర్పేదెవ్వరు


చీకటిలో కలిసిపోతున్నా

వెలుగును ఇచ్చేదెవ్వరు


ఎవ్వరూ రారు

రాలేరు

కొన్ని సార్లు

చేద్దామనుకున్నా నీకు సాయం చేయలేరు

అందుకని

నీ జీవితాన్ని అలా వదిలేసుకుంటావా

నీ శక్తిని నిర్వీర్యం చ

ేసుకుంటావా


ఓటమికి తలొగ్గకు

కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు

అదీ చేత కాకపోతే పాకుతూ పో

అంతే కానీ ఒకే చోట అలా కదలకుండా ఉండి పోకు

అన్న మహాకవి శ్రీ శ్రీ మాటలు గుర్తు పెట్టుకో


ప్రయత్నాల్ని మానకు

కృషితో నీవు అనుకున్నది సాధించేంతవరకు

దృష్టిని మళ్ళించకు


ఎన్నో ప్రలోభాలు నిరాశలు నీ ప్రయాణంలో ఎదురవ్వచ్చు

వాటిని అధిగమించి ముందుకు నడువు


నిన్ను నువ్వు ప్రేమించు

ఇతరులకి ప్రేమను పంచు


Rate this content
Log in