తులసీ పూజ
తులసీ పూజ


పరమ శివుని త్రిశూలము ఉన్నా
శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రము ఉన్నా
లోకమున మరే అస్త్ర శస్త్ర విద్యలున్ననూ
తల్లీ తులసీ! నీ భక్తి యొక్క శక్తే గొప్పదని
శివుడు కార్తికేయునికి తులసీ కవచము ఉపదేశించిగా కార్తికేయుడు నిను జపియించి
తారకాసురుని వధియించు శక్తి పొందెనట
పదునాలుగు భువనములు పాలించు
శ్రీ మహా విష్ణువు ఒక్క తులసీ దళము
భక్తితో సమర్పించిన పొంగిపోవునట
లోక పావనీ సర్వ దేవతా స్వరూపిణీ
నిత్యము దీపారాధన చేసి నీ ముందు జోలె పట్టితిని
నమ్మి తులసీ కవచమును జపియించితి
సర్వ వ్యాధి నాశినీ హే జగన్మాతా
కరుణతో నా మొర ఆలకించి సర్వ పాపములు హరియించి మృత్యు పీడలు నాశనము చేయవే
కృష్ణ జీవని తులసీ దేవీ
సదా మంగళమొనర్చవే!