STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama

4  

Ramesh Babu Kommineni

Drama

కనిపించకపో కరోన

కనిపించకపో కరోన

1 min
22.8K

ప౹౹ కదిలి పోవే కరోనా కనిపించకపో మహమ్మారి కరాళ వికాట్టాట్టహాసం ఆపి తరలిపో ఈసారి ౹2౹ చ౹౹


ప్రళయం కన్నా ప్రమాదికారిగా దాపురించావే ప్రపంచ యుద్దంలా ప్రాణాలనే సంహరించావే ౹2౹


దొంగలాగ మనిషి ఊపిరిలో చేరి మట్టగిస్తావు దుంగలాగ అడ్డగించేసి మరి మట్టు పెట్టేస్తావు ౹ప౹ చ౹౹


మనిషీ తిరిగే వ్యాపకాన్ని తీరికతో నిగ్రహించు మనిషికి మనిషికి దూరమే మందని గ్రహించు ౹2౹


వైద్యులు చెప్పే వైనం పాటించి నిలువరించూ బాధ్యుల సూచనలను బాధ్యతతో సాగించూ ౹ప౹ చ౹౹


మనిషిని చూసి మనిషే వణికే రోజొకటుందని ప్రపంచానికి తెలిపావూ ఇలాంటిదొకటుందని ౹2౹


సహనంతో సాగించరే కరోనాపై దండయాత్రగ సహజమైన దూరమూ పాటించి సరి మాత్రగ ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Drama