విన్నవించుకోవాలని ఉన్నది..!
విన్నవించుకోవాలని ఉన్నది..!
ఈ మదిలోని భావన మీ వరకు చేరలేక పోతున్నదా?
ఈ రోజు నీ చరణములందు విన్నవించుకోవాలని ఉన్నది..!
ఏమ్మా వింటున్నావా? ఊకొట్ట గలవా?
ఏ రోజు అయితే మీ చరణములను పట్టు కోవాలని అనుకుంటినో
మీ దయ హస్తము మాపై రక్షణ హస్తంగా మారెను లే....
అయిననూ ఈ మనస్సు విషయవాంఛలతో నిండకుండా ప్రేమ దానన్ని ప్రసాదించగల వా ? !!ఏమ్మా వింటున్నావా?!!
ఈ ప్రాపంచిక ధర్మాలను, మీ ఆజ్ఞను పాటించు లాగున..
కఠిన పరీక్షలు దాటుకొను లాగున, నిర్మల మనస్సుతో నుండులాగున
పారమార్థిక అభివృద్ధి చెందు లాగున మీ ఇచ్చాను ధరించగల వా? !!ఏమ్మా వింటున్నావా?!!
మీరు ఎదురుగా ఉన్నప్పుడు అంతులేని విరహవేదన
కనుల నిండా నీ రూపమే అయి, నీతోనే ఉండాలని ఆలోచన
త్వరగా త్వరగా మృదువుగా ఈ జీవుని మీ ధామానికి చేర్చుకోవా? !!ఏమ్మా వింటున్నావా?!!