ప్రేమ
ప్రేమ


పద్యం:
అమ్మ ప్రేమ వుండు యలరు వోలె పొలయు
తండ్రి ప్రేమ వుండు తావి వోలె
విశ్వమందు నున్న వింత యిదియె గాద
బుధ్ధి ధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! అమ్మ చూపించే ప్రేమ పువ్వు లాగా ఉంటుంది. నాన్న చూపించే ప్రేమ సువాసన లాగా ఉంటుంది. విశ్వము లో ఉన్న వింత ఇది కాదా? (అవును అని అర్థం.)
అమ్మ ప్రేమ మనకు కనబడే విధంగా ఉంటుంది కాబట్టి, అందంగా కనబడే పువ్వుతో మరియు నాన్న ప్రేమ మనకు కనబడని విధంగా ఉంటుంది కాబట్టి, కనబడని సువాసనతో పోల్చడం జరిగింది. ఇది కూడా విశ్వం లోని ఒక వింత అని అర్థం.