కోమల కుసుమాలు
కోమల కుసుమాలు
పరిమళ ప్రకృతి చేసిన అందమైన సృజనం,
అద్భుతం ఇహలోకంలో తరు లతల జననం,
అందున సుగన్ధిత కోమల కుసుమాల ప్రజనం,
ఆ అందం వీక్షించి ఆనందించెను సర్వజనం |౧|
శ్వేత వర్ణంలో కనిపించెను నందివర్ధనం మల్లి పూలు,
రక్త వర్ణంలో కనియించెను గులాబీ మందారం పూలు,
పసుపు వర్ణంలో కనిపించెను బంతి చామంతి పూలు,
నీలం వర్ణంలో కనిపించెను నీలకమలం శంఖం పూలు |౨|
స్వర్ణ వర్ణం పొందింది సూర్యముఖీ పుష్పం,
సువాసన పొందింది సంపంగి జాజి పుష్పం,
ఎంతో సున్నితమైనది కనకాంబరం పుష్పం,
కనువిందు అనిపించెను కలువ కమల పుష్పం |3|
దేవదేవిలా పూజల కోసం కోమల కుసుమాలు అవసరం,
శ్రీజగన్నాథ వెంకన్నల మాలల కోసం పూలు అవసరం,
పూబంతి కోసం నానా రకాల రంగుల పువ్వులు అవసరం,
వనం ఉపవనం అందం కోసం పూలు ఎప్పుడు అవసరం |౪|