భవదీయుడు
భవదీయుడు
దాసుడులే జన్మలుగా..నీ ప్రేమకు భవదీయుడు..!
బంధుడులే హుషారుగా..నీ పాటకు భవదీయుడు..!
నీ అడుగుల సవ్వడితో..పరవశించు మానసుడే..
బద్ధుడులే మౌనముగా..నీ ఆజ్ఞకు భవదీయుడు..!
చిత్తశుద్ధి మంత్రముగా..పొందినాడు నీ దయతో..
ముగ్ధుడులే తరాలుగా..నీ ఆటకు భవదీయుడు..!
నీ చూపుల ప్రణవనాద..సుధాఝరిని మునిగినాడె..
ప్రాజ్ఞుడులే యుగాలుగా..నీ పూజకు భవదీయుడు..!
మెఱుపునేలు చైతన్యపు..గగనమునే చేరినాడు..
మేఘుడులే సరసముగా..నీ తోటకు భవదీయుడు..!
సంగీతము సాహిత్యము..నీ రెప్పల నీడలోనె..
సఖ్యుడులే విజ్ఞతతో..నీ వాడకు భవదీయుడు..!

