గురువు శ్వాస
గురువు శ్వాస
జన్మ గతులు సంగతులు..తెల్పు గురువు శ్వాస..!
కర్మలన్ని సరిగ బూది..చేయు గురువు శ్వాస..!
తెలిసి తెలియనటుల..నటన మానవేల..
మంత్రతంత్ర యంత్రాలను..నిల్పు గురువు శ్వాస..!
నమ్మకాల బుడుగులోన..నవ్వులాట బ్రతుకు..
మెతుకుపాట ఊటమాటు..మెఱుపు గురువు శ్వాస..!
మాట మౌనమైన చాలు..మిగులు ఆటవిడుపు..
చెలిమివెలుగు పూలతోట..పెంచు గురువు శ్వాస..!
విశ్వాసపు తోరణాల..రణమునాప తరమె..
మూఢభక్తి ముచ్చటలను..కాల్చు గురువు శ్వాస..!
మందులతో పనేలేక..వ్యాధిబాధ లన్ని తీర్చు..
మనసుగొడవ మట్టుపెట్టు..గురువు గురువు శ్వాస.
