మోక్షమదే
మోక్షమదే
భక్తిమాటు మరణభయం..దూరమైన మోక్షమదే..!
పూజమాటు కోర్కెగొడవ..దగ్దమైన మోక్షమదే..!
సత్యమెంత స్పష్టముగా..బోధపడిన అంత హాయి..
చిరునవ్వుల పూలతోట..సొంతమైన మోక్షమదే..!
వెన్నంటే నీడంటే..నాది-నేను భా'వనమే..
ఆ వనమే సరిగ కాలి..మాయమైన మోక్షమదే..!
మనసుకన్న మోసగించు..నేస్తమెవ్వ రుండరులే..
తనే కాస్త నిన్ను వదిలి..శూన్యమైన మోక్షమదే..!
హాస్యాస్పద ఊయలేమి..కాదుచూడు తనువన్నది..
చిత్తశుద్ధి బుద్ధిలోన..పూర్ణమైన మోక్షమదే..!

