అప్పగింత
అప్పగింత
నన్నునేను నీ సన్నిధి..చేసుకొందు అప్పగింత..!
నా మనస్సు నా అహమును..ఇచ్చుకొందు అప్పగింత..!
జ్ఞానమనే ముసుగులోన..ఆడుకొంటి నాతో నే..
అజ్ఞానపు గొప్పలకిక..చెప్పుకొందు అప్పగింత..!
విర్రవీగు గుణములెన్నొ..పెంచుకొంటి వింతగనే..
యుద్ధకాంక్షా రతికింక..వ్రాసుకొందు అప్పగింత..!
పీల్చుగాలి కన్న పసిడి..ఏదొ తెలియనైతి కదా..
కాలుష్యపు చర్యలకిక..పెట్టుకొందు అప్పగింత..!
ప్రేమవిలువ సరిగతెలిసి..పంచు సమయమిదే సుమా..
సకల జీవమైత్రి కొరకు..తీసుకొందు అప్పగింత..
