రామకథను
రామకథను
ఎవరు తెలిసి పలికినారు..అందమైన రామకథను..!
ఎవరు అసలు పట్టినారు..దివ్యమైన రామకథను..!
కట్టుకథగ కొట్టివేయు..బుద్ధినెవరు మార్చగలరు..
ఎన్ని తీర్లు అల్లినారు..సత్యమైన రామకథను..!
ఎవరి ఇష్టమొచ్చినట్లు..వారు పలుక అడ్డమెవరు..
నీతులేవొ చేర్చినారు..నిక్కమైన రామకథను..!
"సీతరాముని కేమగును" సందేహము పుట్టె కాద..
వింత ఆటలాడినారు..వేదమైన రామకథను..!
రామాయణ కల్పవృక్ష..విషవృక్షాలు వెలసెనా..
చర్చలకే దించినారు..ధర్మమైన రామకథను..!
