పండుగ కద
పండుగ కద
గుండెలయల నెమలి ఆట..చూడటమే పండుగ కద..!
గున్నమావి కొమ్మమనసు..అందటమే పండుగ కద..!
మధుమాసపు ప్రేయసియై..హొయలొలికే మల్లెతోట..
పరిమళించు వేళ కాస్త..తెలియటమే పండుగ కద..!
ఆరురుచుల మేళవింపు..ఆరగింపు వేడుకయే..
చెఱకుపాల మధురిమలను..పంచటమే పండుగ కద..!
అమ్మమౌన రాగాలను..స్వరపరిచే వారెవ్వరు..
తెలుపలేని ఆవేదన..తీర్చటమే పండుగ కద..!
కర్మచక్ర మేమిలేదు..సత్యమేదొ బోధపడితె..
కొలమానం ఆట సాక్షి..నిలపటమే పండుగ కద..!
