పూజ ఇదే
పూజ ఇదే
తనకోసమె తనకోసమె..మనసుపూల పూజ ఇదే..!
చెలిమిగంధ మయ్యేందుకు..వలపుపూల పూజ ఇదే..!
తీపికలల ఆకాశం..ఉంది కదా తన కన్నుల..
కరుణించే తన ప్రేమకు..మెఱుపుపూల పూజ ఇదే..!
మాటైనా పాటైనా..తన శ్వాసల పరిమళమే..
అల్లుకున్న తన ఊహకు..తలపుపూల పూజ ఇదే..!
చెప్పరాని వేదాంతపు..వెన్నెలంటె తన చూపే..
తన మౌనపు కోవెలలో..వెలుగుపూల పూజ ఇదే..!
సంపెంగల వనమునేలు..చక్రవర్తి తాను కదా..
తనపదముల ముద్రలకే..ముద్దుపూల పూజ ఇదే..!
