STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

హోళీ

హోళీ

1 min
3



'ఆకుపచ్చ'ని ప్రకృతిని ప్రేమిద్దాం,
'పసుపు కుంకుమ' సౌభాగ్యములనే కోరుకుందాం,
తొలిసంధ్యా 'ఎరుపే' చైతన్యరాగాలుగా పాడుకుందాం,
'నీలా'కాశపు నింగిలో కాదూ 
సత్యలోకపు ఇలలో జీవిద్దాం,
చెమ్మగిలిన హృదయమే 
'నల్లని' చీకటి వెతలకు సాక్ష్యంగా చెప్పుకుందాం,
విశ్వవీధులలో శాంతి'తెల్ల'పావురాలనే ఎగురవేద్దాం,
అందరితో స్నేహంగా 
మెలిగే తీరునే 'సప్తవర్ణాల' 
ఇంద్రధనుస్సుగా చెబుదాం.

కామమోహలు దహియించు 
కాముడి పున్నమినే రంగులపండుగగా జరుపుకుందాం,
మానవతా విలువల శ్వాసలతో 
రంగులలోకంలో విహరిద్దాం,
వాగ్దానపు నాయకుల 
అసలురంగు చూపమని దేవుడిని ప్రార్ధిద్దాం,
తీయని మనసుబంధాలతో 
హోళీ వేడుకను 
అద్భుతాల స్నేహానుబంధానికి 
సాక్ష్యంగా నిలుపుకుందాం.


Rate this content
Log in

Similar telugu poem from Classics