STORYMIRROR

Midhun babu

Classics Inspirational Children

4  

Midhun babu

Classics Inspirational Children

ఆమె

ఆమె

1 min
4

ఓయ్ ! ఆగు ఆమెని ఏమీ అనకు.
తను ఒక అల్లరి పిల్ల. 
నువ్వు నిదురపోతున్నపుడు ఎందుకో నీ హృదయం లో అందెల సవ్వడి చేస్తుంది.
నువ్వు మేల్కాంచినపుడు ఎందుకో చిరునవ్వుతో ఎదురొస్తుంది.
నువ్వు అలసిపోయినపుడు ఎందుకో తన ఒడిని విశ్రాంతి మందిరం చేస్తుంది.
నువ్వు బాధల చీకట్లో ఉన్నప్పుడు ఎందుకో ఓదార్పు దీపం వెలిగిస్తుంది.
నువ్వు కోపం గా ఉన్నపుడు ఎందుకో ప్రశాంతత నిండిన కలువ లా వికసిస్తుంది.
నువ్వు ఆకలి గొన్నపుడు ఎందుకో కొసరి కసరి తినిపిస్తుంది.
నువ్వు అలిగి నపుడు ఎందుకో గారవించి జోల పాడుతుంది.
నిన్ను నీకు ఎప్పుడూ సందడిగా పరిచయం చేస్తుంది.
తాను తుంటరి తెమ్మెర అయ్యి పువ్వుల పరిమళాలు అద్దుతూ నిన్ను పూవనిలా మారుస్తుంది.
నిన్ను నిమ్మళం గా ఉండనీక నీలో నిరతరం
 గోదారి పరవళ్లు తెస్తుంది..ఎందుకు ?
ఎందుకంటే తను నీ భార్య 
నిన్ను నిన్ను గా ప్రేమించే నీ అల్లరి పిల్ల.
 నీ ప్రేమలో మునిగి పోయే చిన్న పిల్ల.


Rate this content
Log in

Similar telugu poem from Classics