ఆకుపచ్చ చీర
ఆకుపచ్చ చీర
అంశం: ఆకుపచ్చ..
పైరు "ఆకుపచ్చ"ని చీర కట్టి ధరణిపై పవళించింది..
పిల్లగాలికి పడుచు దనం, పసి ప్రాయం ఆకు పచ్చని పొలంలో సేద తీరుతున్నాయి..
పిట్టలేమో కువ కువలాడుతూ గరికల పచ్చదనంలో పొర్లి గింజలు ఏరుతున్నాయి..
ఆకు పచ్చని చీర కట్టిన నేల మిస మిస లాడుతూ పచ్చదనంతో మెరిసిపోతుంది..
కాలుష్యం లేని హరితవనంలో అన్ని స్వచ్చమైన గాలిని పీల్చుకుంటున్నాయి..
అచ్చమైన ఆకుపచ్చ అందాలన్నీ తెలుగింటి పల్లె పైరు పిల్లగాలిలో సేద తీరుతున్నాయి..
