పరమార్థం
పరమార్థం
నడుస్తున్న దీపంలా..బ్రతుకుటయే పరమార్థం..!
చెలిమివనంలాగ మనసు..నిలుపుటయే పరమార్థం..!
అణుబాంబులు క్షిపణులేమి..పనికివచ్చునో ఇప్పుడు..
జీవహింస ఇకనైనా..మానుటయే పరమార్థం..!
శాస్త్ర సాంకేతికతలు..ఎంత వృద్ధి చెందితేమి..
ఆలోచన ప్రమాణాలు..పెరుగుటయే పరమార్థం..!
ఎన్ని భాష లేతీరుగ..నేర్చకున్న ఫలితమేమి..
పరమాద్భుత మౌనముతో..కూడుటయే పరమార్థం..!
తేలికైన ఆహారం..కాపాడును ఆరోగ్యం..
విశ్వకాంతి భుజించగా..పట్టుటయే పరమార్థం..!
