గంగాధర
గంగాధర
గంగాధర..! జాగెందుకు.. కాలుష్యము తుడిచేందుకు..!?ఓ రుద్రా..! జాలెందుకు.. పాపాలను నరికేందుకు..!?
నీవున్నది సత్యమైతె కాస్త రుజువు చూపాలిక..!పరమశివా..గొడవెందుకు.. దారిద్ర్యము కాల్చేందుకు..!?
గాఢ నిదుర మునిగియున్న ఈ జగతిని మేల్కొల్పుము..!సుప్రభాత మింకెందుకు.. రోగాలను మాన్పేందుకు..!?
ప్రతి హృదయం నీ సుందర దేవాలయమౌను కదా..!స్తోత్ర పాఠమది ఎందుకు..వైభోగము ఇచ్చేందుకు..!?
గుండె లయను తెలియలేరు డమరుకముగ అయ్యయ్యో..!అభిషేకములవి ఎందుకు..జ్ఞాన సుధను కురిసేందుకు..!?
