దండం
దండం
ప్రాణం తీసే..మనిషికి దండం..!
ప్రేమను పంచే..బుద్ధికి..దండం..!
ఆశయె రాగం..చెప్పడ మెలాగ..
పిట్టను కాచే..మట్టికి దండం..!
చెట్టును కొట్టకు..నరుడా ఆగుము..
మొక్కలు పెంచే..చేతికి దండం..!
చల్లని వెన్నెల..గీతం ఏదోయ్..
శ్వాసగ దొరికే..గాలికి దండం..!
చంపుకు తింటే..బహుమతి రోగం..
శాంతిని నిలిపే..జాతికి దండం..!
కత్తులు బాంబులు..తెగబడ వెపుడూ..
సహనం నిలిపే..శక్తికి దండం..!

