Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Comedy Classics Others

3  

Midhun babu

Comedy Classics Others

నువ్వుల

నువ్వుల

1 min
2



ఎండాకాలంలో కుండలో నీళ్లలా మారినట్లు

చిలుక కొరికిన పండు నోట్లోకి జారినట్లు

పరీక్షలో నూటికి నూరు మార్కులు వచ్చినట్లు

దరహాస రేఖలు భూతద్దం లేకుండానే కన్పించాలి

నవ్వితే శరీరమంతా గాలిలో తేలాలి

నవ్వుల నవరత్నాలు ఏరుకోవాలనిపించాలి


చెట్టు మండలిరిసినట్లు మనిషి రెక్కలిరిచి

ఎవరినైనా ఏడిపించి నవ్వొద్దు

విలపిస్తుంటే ఓదార్చడం మాని ముసి ముసి నవ్వులొద్దు

నోటితో నవ్వి నొసటితో, చివరకు కాలిగోటితో వెక్కిరించే చిత్రాలు తగవు

మన ఏడుపు కాదు నవ్వు ఇతరులను నవ్వించాలి

దరహాసరేఖల్ని ఏ రబ్బరుతో చెరిపేయొద్దు


ఎవరి నవ్వైనా వారికి ఆరోగ్యవంతమే

నవ్వుతూ చేసే శ్రమలో అలసట దూరం

ముఖం తేజోవంతం, అంతరంగంలో ఆనందం

నవ్వడం లలాట లికితం కాదు

ఫోటోల కోసం పల్లికిలించడం అంతకంటే కాదు

తెచ్చి పెట్టుకున్న నవ్వు తేలిపోతుంది దూదిపింజలా

కడుపునిండా, కుతితీరా నవ్వాలి

నవ్వినప్పుడల్లా లోపలి మలినాలు కొట్టుకుపోవాలి


పాపలవైనా, పడతులవైనా, వృద్దులవైనా, పూలవైనా, పక్షులవైనా నవ్వుతున్న దృశ్యాలు

చెక్కిన శిల్పాలు, మనసులపై చెరగని వాల్ పోస్టర్లు

నవ్వుతూ ఎదగడం, నవ్వుతూ జీవించడం

చివరకు నవ్వుతూ చావడం గొప్ప అదృష్టం

ప్రతి జీవి కోరుకోవాల్సిన వరం


Rate this content
Log in

Similar telugu poem from Comedy