మనసెంత
మనసెంత
వ్రాశాను ఓ లేఖ..నీకెలా చేర్చాలి..!?
నీ వెచట ఉంటావొ..అసలెలా తెలియాలి..!?
అక్షరం సాక్షిగా..గీతమై పోయాను
నా శ్వాస నీ పాట..ఇంకేమి పాడాలి..!?
ఓ బొమ్మ గీయగా..అందదే కుంచెకూ..
రంగులే లేని నిను..ఇంకెలా చెక్కాలి..!?
నీకొరకు ఆశపడు..మనసెంత వెర్రిదో..
మాటలకు లొంగదే..నీకెలా చెప్పాలి..!?
నా గుండె లయలోన..నీ అందెల సవ్వడి..
వింటున్న సంగతిని..రుజువెలా చేయాలి..!?
గది వీడి రాలేను..మైమరపు విడలేను..
నీ తలపు గాకుండ..మధువేమి కోరాలి..!?
