ప్రేమికుల
ప్రేమికుల
నీవు నేను స్నేహితులం..అడవిసాక్షి ప్రేమికులం..!
జన్మలుగా సాధకులం..అడవిసాక్షి ప్రేమికులం..!
పుట్టుగుట్టు పట్టేందుకు..మనసునెలా నిలపాలో..
తలపులింటి పాలకులం..అడవిసాక్షి ప్రేమికులం..!
సహనమనే ధనమేదో..సొంతమయే ప్రజ్ఞ కొఱకు..
నిజశ్రద్ధకు వారసులం..అడవిసాక్షి ప్రేమికులం..!
మాటలెంత పదునంటే..ఆయుధాల కేం తెలుసు..
మౌననిధీ వీక్షకులం..అడవిసాక్షి ప్రేమికులం..!
గొప్ప కావ్యమేదంటే..చూపులకే తెలుసంటా..
మహావాక్య మానసులం..అడవిసాక్షి ప్రేమికులం..!
వికారాల కతీతులం..విస్ఫులింగ సేవితులం..
పరస్పరం ప్రేక్షకులం..అడవిసాక్షి ప్రేమికులం..!
