STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

జివితాన్ని

జివితాన్ని

1 min
8


శ్రమజీవిగా ఎదగాలోయి,
కన్నీటి కష్టాలను ఆత్మస్టైర్యంతో గెలవాలోయి,
అంగవైకల్యపు విధివ్రాతను 
స్వేదమే కీర్తిసిరులుగా మార్చునోయి,
కన్నీటితో గుండెబరువు పెంచుకోకోయి,
అలజడుల మనసుకు 
లోకమంతా చీకటిగా కనిపించునోయి,
భయంనీడలో ఛస్తూ బ్రతకద్దోయి 
యాచకులుగా కాదూ 
సాధకుడిగా బ్రతకాలోయి,
జీవిత సమరంలో విలువలే 
విజయపథపు అడుగులుగా 
చేసుకొని సాగాలోయి,
సహనం చాకచక్యంతో 
నిప్పులవలయం దాటాలోయి,
ఎవరో వస్తారాని 
ఏదో చేస్తారని ఎదురుచూస్తుంటే జరగాల్సింది ఆగదోయి,
ప్రయత్నమే లేకుంటే 
మనుగడ ప్రశ్నార్ధకంగా మారునోయి,
కలలతో కాపురం చేయడంకాదోయి,
సాకార దిశగా శ్రమతో సాధించాలోయి.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics