నవ్వొచ్చెను
నవ్వొచ్చెను
కోపానికి తనపైనే..కోపమొచ్చి నవ్వొచ్చెను..!
తాపానికి తనపైనే..మోహమొచ్చి నవ్వొచ్చెను..!
అక్షరాల వనసీమకు..సాక్షిలాగ మనసున్నది..
దేహానికి తనపైనే..రాగమొచ్చి నవ్వొచ్చెను..!
కాగితాల దొంతరలో..కలకలమే కలానికని..
కలహానికి తనపైనే..ద్వేషమొచ్చి నవ్వొచ్చెను..!
ఆరాధన మాటమరచి..మైమరచెను ఈ కనులే..
సరసానికి తనపైనే..ఇష్టమొచ్చి నవ్వొచ్చెను..!
ఖాళీగా ఉండేందుకు..నచ్చదుగా ఊహకసలు..
హృదయానికి తనపైనే..కవనమొచ్చి నవ్వొచ్చెను..!
