STORYMIRROR

Midhun babu

Comedy

3  

Midhun babu

Comedy

అయ్యయ్యో

అయ్యయ్యో

1 min
182

నీకు నేను ఒక పాఠం..చెప్పడమా..అయ్యయ్యో..!

నిను గురువుగ తెలియకనే..పోవడమా..అయ్యయ్యో..!


బుద్ధిలేని తనమేగా..ఎన్ని జన్మలిలా అసలు..

మట్టిమాటు ప్రాణనిధిని..మరవడమా..అయ్యయ్యో..!


ఇసకలోని నూనెనెలా..బంగారం చేస్తావో..

అమ్మపాలు డాలర్లకు..అమ్మడమా..అయ్యయ్యో..!


వేపపుల్ల ఏమనునోయ్..పేటెంట్లను వ్రాసిస్తే..

కల్పతరువు ఆవేదన..పెంచడమా..అయ్యయ్యో..!


మేధస్సును అరువిస్తూ..తలవంచే పనేమిటో..

ఆరోగ్యపు లోగిలి మది..పిండడమా..అయ్యయ్యో..


Rate this content
Log in

Similar telugu poem from Comedy